సీనియర్ హీరోలు చిరంజీవి బాలకృష్ణలు సినిమాల పరంగా దూసుకు పోతుంటే నాగార్జున కనీసం బుల్లితెరలో అయినా రాణిస్తున్నాడు. అయితే వెంకటేష్ మాత్రం సినిమాల ఎంపిక విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఎఫ్ 2’ సూపర్ సక్సస్ తరువాత వెంకీ కెరియర్ గాడిన పండింది అని అనుకుంటున్న పరిస్థితులలో మళ్ళీ అతడికి డల్ సీజన్ ప్రారంభం అయింది.


వెంకీ తన కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా తన 75వ సినిమాను తీర్చిదిద్దాలని చాలగట్టి పట్టుదలతో ఉన్నాడు. దీనితో తన తదుపరి సినిమాకు సంబంధించి అనేకమంది దర్శకులు చెపుతున్న కథలు వింటున్నప్పటికీ ఏకథకు వెంకీ ఓకె చేయలేకపోతున్నాడు అని అంటున్నారు.



వెంకటేష్ తో సినిమా తీయాలని అనేకమంది ప్రముఖ నిర్మాతలు ప్రయత్నిస్తున్న పరిస్థితులలో ‘హిట్ 2’ డైరక్టర్ శైలేష్ ‘శ్యామ్ సింగ రాయ్’ డైరక్టర్ రాహుల్ ‘బంగార్రాజు’ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇలా చాలామంది యంగ్ డైరెక్టర్స్ వెంకీ వైపు ఆశగా చూస్తున్నట్లు టాక్. కొద్దిరోజుల క్రితం దర్శకుడు సంపత్ నంది వెంకటేష్ ను కలిసి ఒక కథను చెప్పినప్పటికీ వెంకటేష్ ఎలాంటి అభిప్రాయం చెప్పకుండా తన భార్య పిల్లలతో క్రిస్మస్ వెకేషన్ కు వెళ్ళినట్లు తెలుస్తోంది.



మళ్ళీ న్యూయిర్ తరువాత మాత్రమే వెంకీ హైదరాబాద్ వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు.  దర్శకుడు రేంజ్ తో సంబంధం లేకుండా తనకు కథ నచ్చితే చాలు అని చెపుతున్న పరిస్థితులలో చాలామంది దర్శకులు వెంకీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది అని అంటున్నారు. ముందుగా వెంకటేష్ అన్న సురేష్ బాబు వినాలి అతడు ఓకె చెప్పాలి అంటున్నారు. అప్పుడు కానీ వెంకీ లైన్ లోకి రాడట. ఇంత శ్రమపడి వెంకటేష్ ను ఒప్పించుకునే బదులు ఒక మీడియం రేంజ్ హీరోతో సినిమాలు చేసుకుంటే బెటర్ అన్న ఆలోచన కొందరి దర్శకులకు వస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: