మృణాల్ ఠాకూర్ భిన్నమైన వ్యక్తిత్వం ను కలిగిన హీరోయిన్. ఆమె ముక్కుసూటిగా నే మాట్లాడతారు. మృణాల్ కామెంట్స్ కొన్ని సామాజిక నియమాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి.

పిల్లలు కావాలంటే పెళ్లే చేసుకోవాల్సిన అవసరం లేదని మృణాల్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ కాలంలో పిల్లలను పొందేందుకు అనేక మార్గాలు చాలా ఉన్నాయి. కాబట్టి తల్లి కావడానికి మగాడి తోడు అవసరం లేదంటుంది ఆమె. ఇక తాను జీవితంలో వివాహం చేసుకోనని కూడా మృణాల్ చెప్పారు. తనకు వివాహం పై ఏ మాత్రం ఆసక్తి లేదని వెల్లడించారు. ఇండియన్ సొసైటీలో పెళ్లి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ గా భావిస్తారు. కానీ మృణాల్ ఆ బాధ్యత నాకొద్దని గట్టిగా చెబుతుంది.

తాజాగా ఆమె హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. నటుల పారితోషికం వారికి ఉన్న గుర్తింపుపై ఆధారపడి ఉంటుంది. హీరోయిన్స్ రెమ్యూనరేషన్ అడిగే విషయంలో అయోమయానికి గురవుతున్నారు. తాము కోరుకున్న రెమ్యూనరేషన్ గట్టిగా ఎందుకు అడగలేకపోతున్నారు. ఈ విషయంలో హీరోయిన్స్ ఎలాంటి మొహమాటం, సిగ్గు ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మన రెమ్యూనరేషన్ ఎంత గట్టిగా డిమాండ్ చేశాం, అడిగి తీసుకున్నాం అనే విషయాలపై మన ఆత్మ విశ్వాసం, నమ్మకం ఆధారపడి ఉంటాయి.

మన విలువ మనం స్పష్టంగా నిర్ణయించుకోలేకపోతే ఎలా? అంటూ తోటి హీరోయిన్స్ కి ఆమె సలహా ఇచ్చారు. మృణాల్ కామెంట్స్ వైరల్ గా మారాయి. కాగా సీతారామం మూవీతో మృణాల్ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. దుల్కర్ సల్మాన్-మృణాల్ జంటగా నటించిన సీతారామం చిత్రంలో రష్మిక మందాన కీలక రోల్ చేశారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం బిగ్ హిట్ అని చెప్పాలి. సీత పాత్రలో మృణాల్ అద్భుతం గా చేశారు. ఆ చిత్రం ఆమెకు తెలుగులో మంచి ఫేమ్ ను తెచ్చిపెట్టింది.

కాగా మృణాల్ సీరియల్ నటిగా తన కెరీర్ మొదలుపెట్టారు. అక్కడ సక్సెస్ వచ్చాక సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ కోసం ఎంతో ట్రై చేశారు. హిందీ చిత్రం లవ్ సోనియా చిత్రంతో మృణాల్ కి బ్రేక్ వచ్చింది. ఆమె హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ చిత్రాలు సూపర్ 30, బాట్లా హౌస్ చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. కెరీర్ బిగినింగ్ లో మృణాల్ అనేక అవమానాలు కూడా ఎదుర్కొన్నారట. ఆమెను మట్టి కుండలా ఉన్నావని ఎగతాళి చేశారట. సల్మాన్ ఖాన్ మూవీ సుల్తాన్ హీరోయిన్ గా మొదట ఎంపిక చేసి, తర్వాత తొలగించారని కూడా మృణాల్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: