
అసలు విషయంలోకి వెళ్తే.. అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న 18 పేజీస్ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఇక్కడ సినిమాను ప్రమోట్ చేయకుండా అల్లు అర్జున్ ని ప్రమోట్ చేసినట్లు కనిపిస్తోంది. నిర్మాతలు కూడా తమ సొంత సినిమాని కాకుండా అల్లు అర్జున్ ను ప్రమోద్ చేస్తున్నారా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. నిజానికి 18 పేజీస్ ఈవెంట్లో సినిమా కంటెంట్ పై బస్ క్రియేట్ చేయడానికి బదులు నిర్మాతలు అల్లు అర్జున్ ని గ్రాండ్ గా ఎంట్రీ ఇప్పించి అతడి చిత్రం పుష్ప సినిమాని కూడా ఓ రేంజ్ లో పొగిడేసారు.
దీంతో నిఖిల్ అభిమానులు పూర్తిస్థాయిలో హర్ట్ అవుతున్నారు. నిఖిల్ సినిమా ఈవెంట్ కి వచ్చి అల్లు అర్జున్ పుష్ప సినిమాను ప్రమోట్ చేయడం ఏంటి ? అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక స్టార్ హీరోకి ఇంతకంటే ఘోర అవమానం ఇంకొకటి ఉంటుందా అంటూ కూడా కామెంట్లు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మరి ఈ విషయంపై నిఖిల్ ఎలా స్పందిస్తాడో తెలియాల్సి ఉంది. మొత్తానికైతే కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఈ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.