తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ పోయిన సంవత్సరం వలిమై అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేకపోయింది.

అలా వలిమై మూవీతో ప్రేక్షకులను కాస్త నిరాశపరచిన అజిత్ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన తునివు అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించాడు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం ... అలాగే ఈ ట్రైలర్ లో అజిత్ లుక్స్ అదిరిపోయే రేంజ్ లో ఉండడం ... అలాగే ఈ మూవీ ట్రైలర్ లో చూపించిన యాక్షన్స్ సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉండడంతో ఈ ట్రైలర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర బృందం కేవలం తమిళ భాషలో మాత్రమే విడుదల చేసింది.

తమిళ భాష ట్రైలర్ కు 24 గంటల్లో 24.96 మిలియన్ వ్యూస్ ... 1.4 మిలియన్ లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే తునివు మూవీ ట్రైలర్ కు 24 గంటల్లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగులో తెగింపు అనే పేరుతో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ నుండి అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: