పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై తెలుగు భాష రొమాంటిక్ కామెడీ చిత్రం 18 పేజెస్ కి సుకుమార్ రైటింగ్స్ అందించారు.ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ హీరోగా.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు. రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు భారీ విజయాన్ని సొంతం చేసుకుని దూసుకుపోతుంది. అంతేకాదు కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో రాబడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా నిన్న ఆదివారం పైగా న్యూ ఇయర్ కావడంతో చాలామంది 18 పేజీస్ సినిమా చూడడానికి ఆసక్తి చూపించారు . అంతేకాదు పలుచోట్ల చాలా థియేటర్స్ హౌస్ఫుల్ తో రన్ అవ్వడం గమనార్హం..
దీన్ని బట్టి చూస్తే కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నిఖిల్.. ఇప్పుడు మళ్లీ 18 పేజీస్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అని తెలుస్తోంది. ఇప్పుడు వేరేక సినిమాతో మన ముందుకు వస్తాడా? లేక డైరెక్ట్ కార్తికేయ3 సినిమాతో ప్రేక్షకులను అలరిస్తాడా అనేది తెలియాల్సి ఉంది ..ఏది ఏమైనా గత ఏడాదితో పాటు ఈ ఏడాది కూడా ఆయనకు బాగా కలిసి వచ్చేటట్టు కనిపిస్తోంది.