కొత్త బంగారులోకం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అందాల తార శ్వేతా బసు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే భారీ డైలాగులతో మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె బొద్దుగా ముద్దుగా యువతను ఆకట్టుకుంది. వరుణ్ సందేశ్ కి జోడిగా టీనేజ్ అమ్మాయి స్వప్న పాత్రలో నటించి అలరించింది. ఆ తర్వాత కొన్ని చిత్రాలలో నటించిన ఈమెకు పెద్దగా అవకాశాలు రాకపోయేసరికి బాలీవుడ్ చిత్రాలు , వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా మారింది. ఇకపోతే ఈ భామ నటించిన ఇండియా లాక్ డౌన్ డిసెంబర్ 2న గత ఏడాది ఓటీటీ లో విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో శ్వేతాబసు ప్రసాద్ వేశ్య పాత్రలో కనిపించింది.

జార్ఖండ్లోని జంషెడ్పూర్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ ముంబైలో పుట్టి పెరిగింది. మాస్ మీడియా అండ్ జర్నలిజంలో డిగ్రీ కూడా చేసిన శ్వేతా బసు ప్రసాద్ చిన్నతనంలోనే మక్దే అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది. అంతేకాదు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినప్పటికీ ఇందులో డ్యూయల్ రోల్ చేసి అందరిని మెప్పించింది.  ఇక ఈ చిత్రానికి గానూ ఈమెకు ఉత్తమ బాలనటిగా నేషనల్ ఫిలిం అవార్డు కూడా లభించింది. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకు బాలీవుడ్ లో ఇక్బాల్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమై పలు సినిమాలలో నటించింది. అక్కడ గుర్తింపు తెచ్చుకున్న తర్వాతనే 2008లో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

ఇకపోతే 2018లో రోహిత్ మిట్టల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న అతడితో జీవితం కొనసాగించలేక.. 2019లోనే విడాకులు తీసుకుంది. చాలా చిన్న వయసులోనే కెరీర్ ను ప్రారంభించి బుల్లితెరపై కూడా నటించింది.  ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్ళింది. ఇక్బాల్ చిత్రం తర్వాత సినిమా ఇండస్ట్రీకి కొంత విరామం ఇచ్చిన ఈమె చదువు కొనసాగించింది.  మాస్ మీడియాలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఈమె సంగీత పరిశ్రమలో దిగ్గజాలను కలిగి ఉన్న భారతీయ శాస్త్రీయ సంగీతంపై డాక్యుమెంటరీని కూడా రూపొందించింది. ఈమె జీవితంపై కొన్ని నెగిటివ్ మార్క్స్ పడ్డప్పటికీ ఈమె టాలెంట్ తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: