
గాందేయ ఆదర్శాల ప్రభావంతో ఎంజీఆర్ భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు పాటు నాటకాల్లో నటించిన ఈయన 1936లో సతీ లీలావతి చిత్రంలో సహాయ పాత్రలో నటించి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత 1940 చివరి కల్లా కథానాయక పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలోని ఎదురులేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నాదురై మరణించిన తర్వాత పార్టీ నాయకత్వం చేపట్టిన తన ఒకప్పటి స్నేహితుడు కరుణానిధితో ఎంజిఆర్ కు రాజకీయ విభేదాలు ఏర్పడ్డాయి. అలా 1972లో అన్నాదురై మరణించిన మూడేళ్లకు డిఎంకెను విడిచిపెట్టి సొంతంగా ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట కలగం అనే పార్టీని ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి కావడం జరిగింది. అంతేకాదు తమిళనాడు రాష్ట్రం ముఖ్యమంత్రి కావడంతో భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి పదవి సాధించిన సినీ నటుడిగా చరిత్ర సృష్టించారు.
ఇకపోతే ఎన్టీఆర్ తో ఎంజీఆర్ కు మంచి స్నేహబంధం ఉండేది. ఇద్దరు కూడా కలిసి అటు సినిమా విషయాలను , రాజకీయ విషయాలను కూడా అప్పుడప్పుడు చర్చించుకునేవారు. సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయ రంగంలోనూ తనదైన శైలిలో చక్రం తిప్పిన ఎమ్ జీ ఆర్ ఆ తర్వాత అనారోగ్యం కారణాలతో 1987లో మరణించారు. అయితే ఈయన మరణించే సమయానికి ఇంకా ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగడం గమనార్హం.