సాధారణంగా సినీ ప్రేమికులు సినిమా రిలీజ్ అయితే చాలు థియేటర్ కి వెళ్లి చూసేవాళ్ళు కొంతమంది అయితే ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే ప్రేక్షకులు కూడా కొంతమంది ఉంటారు.. అందుకు తగ్గట్లుగానే ఆయా ఓటీటీ సంస్థలు కూడా కొత్తగా రిలీజ్ అయిన మూవీలను ఆయా ఫ్లాట్ ఫార్మ్ లలోకి తీసుకొస్తూ భారీ రేంజ్ లో క్యాష్ చేసుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే గత ఏడాది 9న రిలీజ్ అయిన గుర్తుందా సీతాకాలం సినిమా సైలెంట్ గా ఓటీటీ లోకి కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది అని.. చాలామంది ప్రేక్షకులకు తెలియదు. ఎందుకంటే ఇందుకు సంబంధించిన అధికారిక అనౌన్స్మెంట్ ఇవ్వకపోవడం వల్లే అభిమానులకు ఈ సినిమా గురించి తెలియలేదు అని చెప్పవచ్చు.

అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.  ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.  ఇందులో సత్యదేవ్ కు జోడిగా తమన్న , మేఘ ఆకాశ్ లు  నటించారు. కన్నడాలో సూపర్ సక్సెస్ అందుకున్న లవ్ మాక్ టెయిల్ అనే చిత్రానికి తెలుగు రీమేకే గుర్తుందా శీతాకాలం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి.. ఈ లవ్ స్టోరీ ని తెరకెక్కించడం జరిగింది. ఇకపోతే తెరపై చూపించే విధానంలో వైవిధ్యం లేకపోవడం వల్లే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి. ఇకపోతే మధ్యతరగతి కుటుంబానికి చెందిన దేవ్ స్కూల్ రోజుల్లో ఒక అమ్మాయిని.. కాలేజ్ రోజుల్లో మరో అమ్మాయిని ప్రేమిస్తాడు.

స్కూల్ డేస్ లో ఫెయిల్యూర్ అయినా.. కాలేజ్ డేస్ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు.  కానీ కొన్ని అనుకోని కారణాల రీత్యా ఆమె కూడా దూరమవుతుంది.  ఆ తర్వాత దేవ్ జీవితంలోకి తమన్నా వస్తుంది.  ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత వారి జీవితంలో జరిగిన పరిణామాలు ఏ విధంగా సాగాయి. అనేది మిగతా కథ. మొత్తానికి అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: