తెలుగు సినిమా ఇండస్ట్రీలో విడుదల అయిన సినిమాలలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంటూ ఉంటాయి. థియేటర్ లలో ఆ సినిమాలు మంచి విజయాలను అందుకోవడం మాత్రమే కాకుండా ఎప్పుడూ టీవీ లో టెలికాస్ట్ అయిన కూడా ఆ సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ తెచ్చుకున్న సినిమాలలో ఈ నగరానికి ఏమైంది సినిమా ఒకటి.

మూవీ కి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించగా  విశ్వక్ సేన్ , అభినవ్ గౌతమ్ , సాయి సుశాంత్ రెడ్డి , వెంకటేష్ కాకమును ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ ప్రొడక్షన్ సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ ని 29 జూన్ 2018 వ సంవత్సరం భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ లభించింది. దానితో ఈ సినిమాకు మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించడం మాత్రమే కాకుండా మంచి విజయాన్ని కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీ లలో ప్రసారం అయినప్పుడు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను తెచ్చుకుంటుంది. ఇలా ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ 4 కే వర్షన్ తో థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా 4 కే వర్షన్ కు సంబంధించిన పనులను కూడా వేగవంతం చేసినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా 4 కే వర్షన్ రీ రిలీజ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: