టాలీవుడ్ లో మంచి స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న చాలా మంది హీరోయిన్లు కూడా బాలీవుడ్ కి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఎవరూ కూడా అక్కడ పెద్దగా క్లిక్ అవ్వలేక ఇప్పుడు ఫేడ్ ఔట్ అయిపోయారు.ఇలియానా, కాజల్ అగర్వాల్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోస్ అక్కడికి వెళ్లి ఫ్లాప్స్ మూటగట్టుకొని ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోయారు. ఇక రీసెంట్ గా రష్మిక మందన కూడా బాలీవుడ్ లో సినిమాలు చేయడం మొదలుపెట్టింది. గతేడాది బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ నటించిన 'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది రష్మిక మందన. కానీ ఈ సినిమా రిజల్ట్ బాగా తేడా కొట్టింది. కనీసం తరువాత సినిమా 'మిషన్ మజ్ను' అయినా.. హిట్ కొడుతుందనే నమ్మకంతో ఉండేది రష్మిక.అందుకే ప్రమోషన్స్ లో కూడా ఈ హాట్ బ్యూటీ చాలా జోరుగా పాల్గొంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తీశారు. అయితే ముందుగా థియేటర్ లో రిలీజ్ చేయాలనుకున్న నిర్మాతలు ఆ తరువాత నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన ఆఫర్ కి ఓటీటీ రిలీజ్ ఒప్పేసుకున్నారు. దాంతో జనవరి 20 వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టారు. ఎంతైనా రష్మిక హీరోయిన్ కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాపై కొంచెం దృష్టి పెట్టారు.


సినిమా కథ 1970 వ సంవత్సరంలో జరుగుతుంటుంది.ఇండియా పోఖ్రాన్ న్యూక్లియర్ పరీక్షను జరిపిన తర్వాత పాకిస్థాన్ దేశం ఆ విజయం పట్ల కుళ్ళుకొని బాగా రగిలిపోతుంటుంది. దీంతో ఏం చెయ్యలేక అణుబాంబు తయారీ ప్రయత్నాలు మొదలుపెడుతుంది. అయితే అక్కడ సీక్రెట్ స్పై గా పని చేస్తుంటాడు హీరో సిద్ధార్థ్. శత్రుదేశం తలపెట్టిన దుశ్చర్యను ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో దాని కోసం దర్జీ వేషం వేసుకుని హీరో అక్కడ బతుకుతుంటాడు. ఇక తను ప్రేమించిన అమ్మాయి(రష్మిక)కి చూపు లేకపోయినా ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. అయితే భారత ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతను ఆ హీరో ఎలా నిర్వర్తించాడనేదే ఈ సినిమా పూర్తి కథ.హాలీవుడ్ సినిమా 'నైట్ క్రాలర్' ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు దర్శకుడు. కానీ ఇదే కాన్సెప్ట్ తో ఇంతకు ముందు చాలా సినిమాలొచ్చాయి. పైగా దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలో సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కథనం అంత ఆసక్తికరంగా అనిపించదు. లవ్ ట్రాక్ ఇంకా సాంగ్స్ చాలా బోరింగ్ గా అనిపిస్తాయి. ఇక రష్మిక యాక్టింగ్ గురించి తెలిసిందే. పరమ చిరాగ్గా అనిపిస్తుంది. అలాగే దర్శకుడు టేకింగ్ సరిగ్గా లేకపోవడంతో సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఈ సినిమాతో రష్మిక కెరీర్ కి ఎండ్ కార్డ్ పడినట్లే అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: