కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.లోకేష్ తన తరువాత సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

మరి లోకేష్ తరువాత సినిమా కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్ దళపతితో తన తరువాత సినిమా ప్రకటించాడు. ఇటీవలే విజయ్ వారిసు సినిమాతో వచ్చి 200 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించాడు...

ఇక ఈ సినిమా అలా పూర్తి కాగానే వెంటనే విజయ్ లోకేష్ సినిమాను పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టాడు.. చెన్నై లో గ్రాండ్ గా లాంచింగ్ ఈవెంట్ కూడా జరిగింది. మరి ఈ సినిమా స్టార్ట్ కావడం నుండే పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను కూడా ఇస్తూ ఈ సినిమాపై అందరి ఫోకస్ పడేలా అయితే చేస్తున్నారు.. ఇక ఈ సినిమా టైటిల్ కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అనౌన్స్ చేస్తామని అఫిషియల్ గా అయితే పోస్టర్ తో వారు ప్రకటించారు.

దీంతో ఈ సినిమా టైటిల్ పై ఉత్కంతట నెలకొంది.. అయితే అఫిషియల్ గా టైటిల్ అనౌన్స్ చేయకముందే ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక వార్త మాత్రం వైరల్ అవుతుంది. ఈ సినిమా టైటిల్ 'కే' లెటర్ తో స్టార్ట్ అవుతుంది అని సమాచారం.అలాగే ఇంగ్లీష్ లో 7 అక్షరాలు కూడా ఉంటాయని సాలిడ్ హింట్ బయటకు రావడంతో ఈ సినిమా టైటిల్ ''ఖైదీ 2'' అయి ఉంటుంది అంటూ కూడా నెట్టింట ప్రచారం జరుగుతుంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే కొంత సమయం ఎదురు చూడాల్సిందే... ఇక ఈ సినిమాలో విజయ్ కు జోడీగా త్రిష నటిస్తుండగా.. సంజయ్ దత్ విలన్ పాత్ర చెయ్యనున్నారు.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ మీద అప్పుడే అంచనాలు కూడా భారీగా పెరిగాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: