ఇండియన్ ప్రముఖ టెన్నిస్ క్రికెటర్ గా పేరు పొందిన సానియా మీర్జా గురించి చెప్పాల్సిన పని లేదు.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో ప్రేమ వివాహం అనంతరం ఈమె పేరు ఎక్కువగా వార్తలలో నిలిచింది. అనంతరం సానియాతో 14 ఏళ్ల దాంపత్య బంధానికి 2024లో ముగింపు పడింది. ఆ వెంటనే షోయబ్ ప్రముఖ పాకిస్తాన్ నటి సనా జావేద్ ను వివాహం చేసుకున్నారు. ఇది మూడో వివాహం అయితే ఈ వివాహం కూడా ఎక్కువ కాలం నిలవలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

సానియా కంటే ముందు షోయబ్ మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆమెతో కూడా ఎక్కువ కాలం కలిసి జీవించలేకపోయారు. ఆ తర్వాత సానియాను ప్రేమించి వివాహం చేసుకున్న  షోయబ్.. నటి సనా జావేద్ తో ఉన్న వివాహేతర సంబంధం వల్లే వీరిద్దరు విడిపోయారని అప్పట్లో వార్తలు వినిపించాయి.  సనా జావేద్ కి షోయబ్ మొదటి భర్త కాదు ఈమెకు కూడా గతంలో పాకిస్తాన్ కి చెందిన ప్రముఖ సింగర్ తో వివాహమయ్యింది. షోయబ్ పరిచయంతో అది ప్రేమగా మారి తన భర్త కు విడాకులు ఇచ్చి మరి సనా షోయబ్ ను రెండో వివాహం చేసుకుంది.


తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రకారం షోయబ్, సనా ఇద్దరు కూడా సోషల్ మీడియా ఖాతాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారని ఇది బంధంలో దూరం పెరగడానికి సంకేతం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ జంట ఒక షోలో పాల్గొన్నప్పటికీ  షోయబ్ ఆటోగ్రఫీ ఇస్తూ ఉండగా సనా ముఖంపై చాలా కోపం, అసహనం క్లియర్గా కనిపించింది. ఇద్దరు కూడా ఒకే చోట కూర్చున్నప్పటికీ దూరం దూరంగా ఉంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉన్నట్టుగా వీడియోలు కూడా వైరల్ గా మారాయి.. దీంతో ఈ విడాకుల వార్తలకు మరింత బలాన్ని చేకూర్చేలా చేసిందనే విధంగా  వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సానియా అభిమానులు ఆనందంతో సానియాను మోసం చేయడం వల్లే ఆమె శాపం షోయబ్ కు తగిలింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: