టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌ రామ్ అమిగోస్ సినిమా నిన్న విడుదల అయ్యి డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా మీద అభిమానులకు సాధారణంగా చాలా అంచనాలుంటాయి. ఎందుకంటే బింబిసారా సినిమాతో కళ్యాణ్‌ రామ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.కళ్యాణ్‌ రామ్ పని ఐపోందిలే అని అంతా అనుకున్నారు. కానీ బింబిసారా సినిమా అయితే ఊహించని రేంజిలో అదరగొట్టేసింది. హీరో కళ్యాణ్ రామ్‌ను ఆ సినిమా మళ్లీ నిలబెట్టేసింది. పటాస్ సినిమా తరువాత బింబిసారా సినిమా మళ్లీ కళ్యాణ్‌ రామ్‌ను రేసులోకి తీసుకొచ్చింది.కళ్యాణ్‌ రామ్ నుంచి బ్లాక్ బస్టర్ బింబిసారా తరువాత వచ్చిన అమిగోస్ మీద కూడా వున్న అంచనాలు గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఆయన త్రిపాత్రాభినయం చేయడం, కొత్త పాయింట్ తో ఊరిస్తూ వచ్చారు. అయితే తీరా ఈ సినిమా జనాల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. అభిమానులకి నచ్చినా కామన్ ఆడియన్స్ నుంచి మౌత్ టాక్  సరిగ్గా లేదు.


రివ్యూలు కూడా యావరేజ్ అని తేల్చి పడేశాయి. దీంతో కలెక్షన్లు కూడా చాలా దారుణాతి దారుణంగా పడిపోయాయి.బింబిసారా సినిమాకు మొదటి రోజు ఏడు కోట్ల దాకా వచ్చాయి. ఇక అమిగోస్ సినిమాకు అయితే కేవలం రెండున్నర కోట్లు మాత్రమే వచ్చాయట. ఇక ఈ సినిమా పన్నెండు కోట్లను కలెక్ట్ చేస్తే తప్పా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లేదని సమాచారం తెలుస్తుంది. ఈ లెక్కన ఈ సినిమాకి వచ్చిన టాక్ చూస్తే బ్రేక్ ఈవెన్ కూడా కష్టమని తెలుస్తోంది.అలాగే ఈ సినిమాకు ఓవర్సీస్‌లో కూడా చాలా చేదు అనుభవం ఏర్పడింది. ఈ సినిమా కంటే రైటర్ పద్మభూషణ్ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయట. ఓవర్సీస్‌లో నిన్నటి లెక్కల విషయానికి వస్తే అమిగోస్‌కు తక్కువగా వచ్చాయట. అక్కడ ఇంకా రైటర్‌ పద్మనాభం సినిమాకే జనాలు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే రైటర్‌ పద్మనాభం సినిమా ఏకంగా 300k డాలర్లను కలెక్ట్ చేసింది. చూస్తుంటే హాఫ్ మిలియన్ డాలర్‌ క్లబ్బులో కూడా ఈ సినిమా చేరేట్టుగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: