టాప్ యంగ్ హీరోల వారసులలో గౌతమ్ అకిరా నందన్ లు మాత్రమే టినేజ్ వయసు లో ఉన్నారు. మిగతా టాప్ యంగ్ హీరోల పిల్లలు అందరూ ఇంకా చిన్నవాళ్ళు కావడంతో అభిమానుల దృష్టి అంతా మహేష్ పవన్ ల వారసులు అయిన గౌతమ్ అకిరా నందన్ లపైనే ఉంది. పవర్ స్టార్ అభిమానులు అదేవిధంగా సూపర్ స్టార్ అభిమానులు వీరిద్దరూ ఎప్పుడు సినిమాలలో నటిస్తారా అంటూ చాల ఆశగా ఎదురు చూస్తున్నారు.


అలాంటి వీరిద్దరూ వేరువేరుగా లేటెస్ట్ గా పాల్గొన్న ఒక షోలో వీరి లుక్ ను చూసి మీడియా వర్గాలు వారివెంట కెమెరాలు పుచ్చుకుని పరుగులు తీయడం చూసిన వారికి వీరి మ్యానియా ఏస్థాయిలో ఉందో అర్థం అవుతుంది. హైదరాబాద్ లో జరగబోతున్న  ఫార్ములా ఈ రేసింగ్ ప్రాక్టీస్ సెషన్ చూడటం కోసం ఈమధ్య మహేష్ వారసుడు గౌతమ్ వచ్చాడు. ఎటువంటి హడావిడి లేకుండా కారులో వచ్చి జనం మధ్య కూర్చున్న గౌతమ్ ను ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఆతరువాత కొంతమంది గౌతమ్ ను గుర్తు పట్టడంతో సందడి మొదలై మీడియా కెమెరాలు కూడ అతడి దగ్గరకు వెళ్ళడంతో గౌతమ్ తెగ సిగ్గు పడిపోయాడు.


అంతేకాదు కొన్ని మీడియా వర్గాలు గౌతమ్ ను సినిమా ఎంట్రీ ఎప్పుడు అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా నవ్వుతూ వెళ్ళిపోయాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ ఒక స్పోర్ట్స్ క్లబ్ లో ఒక ఈవెంట్ చూడటం కోసం ఈమధ్య వచ్చినట్లు వార్తలు వచ్చాయి.


అక్కడ కూడ కొంతమంది అకిరా ను గుర్తుపట్టి సినిమా ఎంట్రీ ఎప్పుడు అంటూ కొందరు ప్రశ్నించినప్పుడు అతడు కూడ నవ్వుతూ వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీరిద్దరి లేటెస్ట్ లుక్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ మహేష్ ల వీరాభిమానులు తమ హీరో కొడుకు బాగున్నాడు అంటే కాదు తమ హీరో మాత్రమే బాగున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ తో చేస్తున్న రచ్చను చూసిన వారు షాక్ అవుతున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: