ఇక rrr సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ మూవీ యూవీ క్రియేషన్స్ లో ఉంటుందని అప్పుడు చాలా వార్తలు వచ్చాయి.టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో రాంచరణ్ 15వ సినిమాగా ఈ ప్రాజెక్టు ఉంటుందని అంతా కూడా అనుకున్నారు.కానీ సడన్ గా దిల్ రాజు- శంకర్ కాంబినేషన్లో లో రామ్ చరణ్ 15 వ సినిమా  సెట్ అయ్యింది. అయితే చరణ్ 16 వ సినిమా మాత్రం యూవీ క్రియేషన్స్ లో ఉంటుందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కథ రాంచరణ్ కు నచ్చడంతో ఈ సినిమా ఇక ఖచ్చితంగా సెట్ అయ్యింది అని అంతా అనుకున్నారు.కానీ కట్ చేస్తే సీన్ లోకి ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు వచ్చాడు.ఇంకా అంతేగాక ఈ ప్రాజెక్టు మైత్రి వాళ్ల వైపు వెళ్ళింది.


గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథ బాగున్నా కానీ అది తన ఇమేజ్ కు మ్యాచ్ అవ్వదేమో అని రామ్ చరణ్ గ్రహించి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు అంతా చెప్పుకొచ్చారు. ఇక రామ్ చరణ్ వద్దన్న కథను మరో యంగ్ హీరో విజయ్ దేవరకొండతో చేయడానికి గౌతమ్ ఇప్పుడు రెడీ అయ్యాడు. అయితే 'యూవీ' లో రామ్ చరణ్ సైన్ చేసిన ప్రాజెక్టు సంగతేంటి? అనే ప్రశ్న అయితే చాలా కాలం నుండి వినిపిస్తోంది.కేవలం రామ్ చరణ్ మాత్రమే కాదు తన తండ్రి చిరు కూడా ఈ బ్యానర్లో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే మొన్నామధ్య కన్నడ దర్శకుడు నార్తన్ చెప్పిన కథ చరణ్ కు బాగా నచ్చింది అనే టాక్ వినిపించింది. ఇటీవల ఈ దర్శకుడిని కూడా రామ్ చరణ్ పక్కన పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథా చర్చలు ఇంకా జరుగుతున్నాయి.మరి చూడాలి సెట్ అవుతుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: