బాలీవుడ్ అగ్ర హీరో రణబీర్ కపూర్ తాజాగా రామ్ చరణ్ నటించిన ఓ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. గత ఏడాది బ్రహ్మాస్త్ర సినిమాతో బాలీవుడ్ లో భారీ సక్సెస్ ని అందుకున్నాడు రణబీర్. ఆ సినిమా సక్సెస్ తో ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ మూవీ ని త్వరలోనే ప్రేక్షకులను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో 'యానిమల్' అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ తో పాటు మిగతా భాషల్లో కూడా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. 

గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ గత ఏడాది ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయింది. అప్పటినుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా తాజాగా పూర్తయింది. ఈ క్రమంలోనే మూవీ టీం అంతా కలిసి యానిమల్ సెట్స్ లో పార్టీ చేసుకున్నారు. డాన్సులు చేస్తూ తెగ సందడి చేశారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలోని జిగేల్ రాణి అనే పాటకు హీరో రణబీర్ కపూర్ అదిరిపోయే మాస్ స్టెప్పులు వేస్తూ తెగ సందడి చేశాడు. తాజాగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. ఈ పాటతో పాటు మరికొన్ని హిట్ సాంగ్స్ కూడా చిందులేసాడు ఈ బాలీవుడ్ హీరో. షారుక్ ఖాన్ చయ్య చయ్య అలాగే హృతిక్ రోషన్ ఏక్ పల్ కా జీనా వంటి పాటలపై అదిరిపోయే స్టెప్పులేసాడు. 

ఈ వీడియోలు కూడా ఇప్పుడు నెట్టెంటా తెగ ట్రెండ్ అవుతూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇక రణబీర్ కపూర్ అలా డాన్సులు వేస్తుంటే మూవీ టీమ్ అంతా కలిసి ఈలలు, గోలలు చేస్తూ నానా రచ్చ చేశారు. దీంతో ఈ వీడియోకి నైటిజన్స్ లైక్స్, కామెంట్స్ తో సోషల్ మీడియా అంతటా హోరెత్తిస్తున్నారు. ఏదైనా ఒక బాలీవుడ్ హీరో తెలుగు పాటకు డాన్స్ చేయడం అది కూడా రామ్ చరణ్ హిట్ సాంగ్ డాన్స్ చేయడంతో చెర్రీ ఫాన్స్ కూడా ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక యానిమల్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. అనిల్ కపూర్, పరిణితి చోప్రా, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 11న ఈ సినిమాను హిందీతోపాటు తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు...!!


మరింత సమాచారం తెలుసుకోండి: