ఎంతో క్రేజీ ఉన్నప్పటికీ కొంతమంది హీరోయిన్ల మాత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేక పోతూ ఉంటారు. మరి కొంతమందికి క్రేజీ ఆఫర్లు వస్తున్న అదృష్టం తలుపు తట్టకపోవడంతో సక్సెస్ ని సొంతం చేసుకోలేక పోతుంటారు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. మలయాళం లో ఒక సంచలనాన్ని సృష్టించిన ఓరు ఆధార్ లవ్.. మూవీ తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఒక సీన్లో హీరోకు కన్నుగీటుతు దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది ప్రియా ప్రకాష్ వారియర్.


ఇక ఈ సినిమా తర్వాత ఈమే క్రేజ్ ఒక్కసారిగా భారీగా పెరిగిపోయింది. కానీ ఈ స్థాయిలో మాత్రం సక్సెస్ ని సొంతం చేసుకోలేక కెరియర్ విషయంలో కాస్త సతమతమవుతోంది ఈ ముద్దుగుమ్మ. ఒరు ఆధార్ లవ్ క్రేజీతో వింకి బ్యూటీగా పేరు తెచ్చుకున్న ప్రియ ఆ క్రేజ్  తో తెలుగులో రెండు సినిమాలలో నటించే అవకాశాన్ని సంపాదించుకుంది. అందులో ఒకటి నితిన్ తో కలిసి చెక్ మూవీ.. తేజ సజ్జా తో కలిసి ఇష్క్.. నాట్ ఎ లవ్ స్టోరీ అనే సినిమాలలో నటించింది. అదృష్టం తట్టిన సక్సెస్ విషయంలో మాత్రం దురదృష్టం ఇమెను వెంటాడిందని చెప్పవచ్చు.


దీంతో ఈ రెండు సినిమాలు ప్రియాకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఆ తర్వాత నుంచి మలయాళ హిందీ వంటి ఇండస్ట్రీలో నటించింది. ప్రియాకు మాత్రం ఎక్కువగా టాలీవుడ్ వైపే మక్కువ చూపుతోందని సమాచారం. ఎక్కడ సినిమా చేసిన టాలీవుడ్ లో నటించాలని ఇక్కడే పేరు తెచ్చుకోవాలి చాలా దృఢంగా కోరుకుంటుందట ఈ ముద్దుగుమ్మ ఆశించినట్టుగానే పవర్ స్టార్ రూపంలో ప్రియా ప్రకాష్ వారియర్ కు ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా సమాచారం. పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ నటిస్తున్న వినోదమ సీతం సినిమాలో.. సాయి ధరంతేజ్ కు జోడిగా కేతిక శర్మ నటిస్తూ ఉండగా కీలకమైన పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ నటించబోతున్నట్లు సమాచారం. మరి ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: