తన వొంపు సొంపులతో మరియు అమాయకమైన చూపుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ అనుపమ పరమేశ్వరన్ . మలయాల్ సినిమా ప్రేమమ్ చిత్రంతో సెన్సేషన్ సృష్టించి అక్కడ నుంచి నేరుగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ . తన సహజమైన నటనా మరియు క్యూట్ నెస్ తో ప్రతి సినిమాలోనూ ప్రత్యేకమైన గుర్తింపును నెలకొల్పుకుంది . ఇక ప్రస్తుతం కమర్షియల్ సినిమాలు మరియు కంటెంట్ బెస్డ్ సినిమాలు రెండిటిలోనూ సమానంగా రాణిస్తూ స్టార్ హీరోయిన్గా ఎందుకు తూ ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంటుంది .


ఇటీవల కిష్కంధపురి తో విజయం సాధించింది . ఇక త్వరలో బైసన్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది . ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ చిన్నతనంలో మనసులో నాటుకుపోయిన మాటలు మరియు కలలపై ఎంత ప్రభావం చూపుతాయో చెబుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది . ఈ బ్యూటీ మాట్లాడుతూ.. " నాకు చిన్నప్పటినుంచి యాక్టింగ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం . కానీ మా స్కూల్లో టాపర్స్ కి మాత్రమే యాక్టింగ్ లో అవకాశం ఇచ్చేవారు . ఎందుకంటే బాగా చదివే వాళ్ళు పెద్ద పెద్ద డైలాగులు నేర్చుకోగలరని గుర్తుపెట్టుకుని చెప్పగలరు అని అనుకునేవాళ్లు .


ఆ మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి . నేను ఎలాగో స్కూల్ టాపర్ ను కాదు కనుక ఇక నటిని అవ్వలేనని భయం వేసేది . అలా నటి కావాలన్నా నా కలను పూర్తిగా పక్కకు పెట్టేసా . కానీ నాకు కొంచెం ఊహ తెలుసా చదువుకు నటనకు ఏ సంబంధం లేదని అర్థం చేసుకున్నాను . మేము చదువుకునే ఎక్కడ నేను రక్షం చేస్తామన్నా ఉద్దేశంతో స్కూల్లో అలా చెప్పే వారిని తెలుసుకున్నాను " అంటూ చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంది అనుపమ . ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: