రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతారా మూవీ ఏ విధమైన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే . ఇక ఈ మూవీ తీవ్రస్థాయిలో వివాదం నడుస్తుంది . తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను బాయ్ కట్ చేయాలంటూ తెలుగు యువత తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తుంది . సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తుందని చెప్పుకోవచ్చు . ఇటువంటి టైం లో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయం మరింత నిరుస్తూ వాహ పరుస్తుంది . ఎందుకంటే మొన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో రిషబ్ శెట్టి అసలు తెలుగే తెలియదన్నట్టు హైదరాబాద్లో కన్నడ మాట్లాడడం జరిగింది .


కానీ ఓజీ చిత్రం విషయంలో మరియు హరిహర వీరమల్లు విషయంలో బెంగళూరులో ఎటువంటి గొడవలు చేశారో మనం చూసాము . తెలుగు పాటలు మరియు తెలుగులో ఫ్లెక్సీలు ఉంటేనే చించేశారు . మరి అటువంటిది హైదరాబాదులో కన్నడలో మాట్లాడితే ఎవ్వరూ పట్టించుకోరా అంటూ తెలుగు యువత ట్రోల్స్ చేస్తున్నారు . కానీ మరీ దారుణం ఏమిటంటే.. ఏపీ ప్రభుత్వం కాంతారా 1 సినిమాకు టికెట్ రేట్లు పెంచేందుకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది . ఇదే ఇప్పుడు తెలుగు యూత్ కు మరింత ఆగ్రహం వ్యక్తం చేసేలా జరిగింది .


డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు పెంపు ఏంటని విమర్శిస్తున్నారు ప్రేక్షకులు . అదే తెలుగు సినిమాలకు కన్నడలో గాని ఇతర రాష్ట్రాల్లో కానీ ఇలా రేట్లు పెంచుతున్నారా ? మరి ఇక్కడ వాళ్లు సినిమాలకు ఎందుకు అంటున్నారు . తెలుగు ప్రేక్షకులు అంటే మరీ అంత చులకనగా కనిపిస్తున్నారా అంటూ మంది పడుతున్నారు . ఒకపక్క బాయ్ కట్ అంటుంటే కనీసం పట్టించుకోరా అని ఫైర్ అవుతున్నారు తెలుగు ప్రజలు . ఏదేమైనాప్పటికీ ఇది ఈ సినిమాపై నెగటివ్ ఎఫెక్ట్ గా పడే అవకాశం ఉంది . మరి దీనికి టాలీవుడ్ నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: