ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిరణ్ అబ్బవరం పోయిన సంవత్సరం ఏకంగా మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో సమ్మతమే మూవీ పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. సెబాస్టియన్ ... నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలు మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచాయి.

అలా పోయిన సంవత్సరం మూడు మూవీ లలో ఒక మూవీ తో పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్న కిరణ్ ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం కూడా ఈ సినిమా ధియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం ఒక విజయవంతమైన సినిమాతో ప్రేక్షకులను అలరించిన కిరణ్ ప్రస్తుతం మీటర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. 

రమేష్ కడూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని తాజాగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీని ఈ సంవత్సరం ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో కిరణ్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో జీప్ లో కూర్చొని ఉన్నాడు. ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: