ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న గ్రేట్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ 1 మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టిన రాజమౌళి ఇప్పటి వరకు ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి దర్శకత్వం వహించిన ప్రతి మూవీ తోనో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే బాహుబలి మూవీ తో ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న రాజమౌళి పోయిన సంవత్సరం ఆర్ ఆర్ ఆర్ అనే మూవీbకి దర్శకత్వం వహించాడు.

మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండడంతో ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభించాయి. అలాగే సినిమా కూడా అత్యద్భుతంగా ఉండడంతో ఇప్పటికే ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు కూడా లభించాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని నాటు నాటు సాంగ్ ఇప్పటికే ఆస్కార్ అవార్డ్ లకు నామినేషన్ కూడా ఆయన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వస్తుంది అని ప్రస్తుతం ఎంతో మంది చాలా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాజమౌళి "నాటు నాటు" సాంగ్ గురించి మాట్లాడుతూ ... ఈ పాట ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నా మదిలో మెదిలేది ఉక్రేయిన్ లోని లోకేషన్. కివ్ లోని అధ్యక్ష భవనం ప్రాంగణంలో ఈ సాంగ్ ను రూపొందించాం. ముందుగా ఈ సాంగ్ ఇండియాలోనే తీయాలి అనుకున్నాం. కాకపోతే వర్షకాలం కావడంతో అది సాధ్యపడలేదు. ఉక్రెయిన్ టీం కృషి తో పర్మిషన్ లభించింది. వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: