మోస్ట్ టాలెంటెడ్ నటుడు అయినటు వంటి ధనుష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విజయాలను అందుకొని స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న ధనుష్ ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా నటుడి గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ధనుష్ "సార్" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించగా ... సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యింది. ఈ మూవీ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 21 రోజుల ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 21 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 20.56 కోట్ల షేర్ ... 38.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వాసులు చేసింది. ఇప్పటికి కూడా ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ  అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 6 కోట్ల బ్రేక్  ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటివరకు ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15.26 కోట్ల లాభాలు దక్కాయి. దానితో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: