కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి ధనుష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ధనుష్ హిట్ ... ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన మూవీ లతో ప్రేక్షకులను పలకరిస్తూ తన కెరీర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఈ హీరో సార్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి తొలి ప్రేమ మూవీ తో దర్శకుడు గా కెరియర్ ను మొదలు పెట్టి మిస్టర్ మజ్ను ... రంగ్ దే సినిమా లతో దర్శకుడుగా తెలుగు లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. 

సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... జీ వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తమిళ్ లో వేత్తి అనే పేరుతో విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు 23 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 23 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

23 రోజుల్లో ఈ మూవీ కి తమిళ నాడు లో 39.20 కోట్ల కలెక్షన్ లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో 39.65 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. కర్ణాటక లో 7.29 కోట్లు , కేరళ లో 1.15 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.20 కోట్లు , ఓవర్ సీస్ లో 24.30 కోట్లు కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 23 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 59.03 కోట్ల షేర్ ... 113.42 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. ఈ 23 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి  ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 23.03 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: