మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగించింది. తమన్నా కమర్షియల్ సినిమాల్లో తన అందచందాలను ఆరబోయడం మాత్రమే కాకుండా ... ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో తన నటనతో కూడా ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే తెలుగు తో పాటు తమన్నా అనేక తమిళ , హిందీ మూవీ లలో కూడా నటించి అక్కడి ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో అలరించింది.

ముఖ్యంగా తమన్నా ఎంతో మంది తమిళ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి చాలా సంవత్సరాల పాటు తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన తమన్నా ఈ మధ్య కాలంలో మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ లో విజయాలను అందుకోవడంలో చాలా వెనకబడిపోయింది. పోయిన సంవత్సరం ఎఫ్ 3 ... గుర్తుందా శీతాకాలం మూవీ లతో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ లలో ఎఫ్ 3 మూవీ  ఎఫ్ 2 రేంజ్ లో విజయం సాధించలేదు.  

గుర్తుందా శీతాకాలం మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేదు.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తమన్నా ... మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భోళా శంకర్ మూవీ లో హీరోయిన్ లో నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే మళ్లీ తమన్నా ఫుల్ ఫామ్ లోకి వచ్చి అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న తెలుగు సినిమాలలో అవకాశాలను దక్కించుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: