
ఐతే హీరోయిన్ గా ఇప్పటికి కూడా ఆమె మంచి గుర్తింపును కలిగి ఉంది అనడంలో సందేహం లేదు. పెళ్లి అయి పిల్లలు అయిన తర్వాత కూడా లయ అందంగా కనిపిస్తున్నారు. ఇటీవల ఆమె వరుసగా సోషల్ మీడియా ద్వారా ఫొటోలు వీడియో లను షేర్ చేయడం ద్వారా మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. అప్పట్లో సినిమా ల్లో నటించే సమయంలో ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఇప్పుడు కూడా సీనియర్ హీరోలకు జోడీగా హీరోయిన్ గా నటించే అవకాశాలు ఈ అమ్మడికి ఇవ్వచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి లయ యొక్క అందం గురించి ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఆహా ఓహో అన్నట్లుగా ఉంది. అన్ని వర్గాల వారిని కూడా ఆమె ఆకట్టుకుంటూ ఉంది. దీంతో చాలా మంది లయ సినిమా ల్లో రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఐతే లయ మాత్రం తన కూతురు ను హీరోయిన్ గా పరిచయం చేయాలని భావిస్తుంది అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. అసలు విషయం ఏంటీ అనేది మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వాల్సిందే. హీరోయిన్ గా లయ కూతురు ఎంట్రీ ఇస్తే తప్పకుండా మంచి ఎంట్రీ దక్కే అవకాశం ఉంది. లయ కు ఇప్పటికి కూడా ఉన్న మంచి పేరు తో పాటు అందం విషయం లో తల్లిని పోలి ఉన్నందున ఈమెకు ఆఫర్లు వెళ్లువెత్తే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పలువురు యంగ్ హీరోలతో లయ కూతురుకు నటించే ఛాన్స్ రావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఐతే ఆమె వరుస ఇంటర్వ్యూ ల కు సంబంధిచిన ఒక న్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతుంది. ఇదంతా తన కూతుర్ని ఇండస్ట్రీ కి పరిచయం చేసి మంచి హీరోయిన్ గా గుర్తింపు ఇవ్వాలన్నదే లయ యొక్క కోరిక అని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. ఐతే ఇందులో ఎంత నిజం ఉందొ లయ మాత్రమే చెప్పాలి.