తాజాగా జరిగిన ఆస్కార్ వేడుకల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి కనువిందు చేసిన విషయం తెలిసింది. అయితే ఈ ఆస్కార్ వేడుకల్లో ఉపాసన ధరించిన స్పెషల్ నెక్లెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ నెక్లెస్ పైనే అక్కడి మీడియా ఫోకస్ పడింది. ఇంకా అక్కడి రిపోర్టర్ అయితే ఉపాసన ధరించిన ఆ స్పెషల్ నెక్లెస్ కాస్ట్ కూడా చెప్పేశాడు. ఇక చరణ్ అయితే తన భార్య ధరించిన నెక్లెస్ ను ప్రొటెక్ట్ చేసుకోవడంలో కాస్త నర్వస్ కాఫీలవుతున్నాడట. దీంతో చరణ్ చేసిన కామెంట్లు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా జరిగిన ఆస్కార్ వేడుకల్లో హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ రామ్చరణ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 

తన భార్యకు ఆరోనెల అని చెప్పడం.. తన బిడ్డ త్వరలోనే రాబోతున్నాడు అంటూ చెప్పడం.. ఇక అంతేకాకుండా ఉపాసన మెడలో ధరించిన నెక్లెస్ గురించి కూడా మీడియా అడగడం.. దాని గురించి రామ్ చరణ్ చెప్పడంతో ఇప్పుడు చెర్రీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆస్కార్ వేడుకలు ఎలా అనిపిస్తున్నాయి? నర్వస్ గా ఫీల్ అవుతున్నారా? అని హాలీవుడ్ మీడియా అడిగితే.. అలాంటిదేమీ లేదని అన్నాడు చరణ్. ఉపాసన మాత్రం కాస్త నెర్వస్ గానే ఫీల్ అవుతున్నట్టు చెప్పింది. ఇదే క్రమంలో ఉపాసన వేసుకున్న నెక్లెస్ గురించి సదరు రిపోర్టర్ మాట్లాడారు. నాలుగు వందల రూబీస్ విలువ కలిగిన నెక్లెస్ ధరించారు అంటూ ఉపాసన గురించి అన్నాడు.

అదే సమయంలో చరణ్ కొన్ని ఫన్నీ సెటైర్స్ వేశాడు. ఇప్పుడు నాకు నెర్వస్ గా అనిపిస్తుంది. నా భార్యని చూసుకోవాలి. తను వేసుకున్న నెక్లెస్ ను చూసుకోవాలి. రెండు రకాలుగా నెర్వస్ గా ఫీల్ అవుతున్నాను' అంటూ చరణ్ ఫన్నీ కామెంట్ చేశాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. ఇందుకుగాను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అలాగే గేయ రచయిత చంద్రబోస్ అవార్డ్స్ ని సొంతం చేసుకున్నారు. ఓ తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడం సినీ చరిత్రలోనే ఇది మొదటిసారి. దీంతో యావత్ సినీ పరిశ్రమ మాత్రమే కాదు యావత్ ఇండియన్ సినిమా మొత్తం త్రిబుల్ ఆర్ టీం పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: