బాలీవుడ్లో అరుదైన హీరోయిన్గా పేరుపొందింది దీపికా పదుకొనే. ఈమె స్థానం ఇప్పటికి చెరిగిపోలేదని చెప్పవచ్చు పాపులర్ డిజైనర్లు ఈ బ్యూటీ అందచందాలను ఎలా చూపించాలో అందుకు తగ్గట్టుగా ఆమె దుస్తులను కూడా డిజైన్ చేస్తూ ఉంటారు. ఆస్కార్ అధ్యంతం ఈ ముద్దుగుమ్మ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇక ఈ ఉత్సవాలలో దీపిక పదుకొనే ఎరుపు రంగు స్ట్రాఫీ డిజైనర్ డ్రస్ లో తళుక్కుమని మెరిసిన అందాలు అక్కడ హైలెట్గా నిలుస్తున్నాయి. దీనిని డిజైనర్ దృక్కోణంలో చూస్తే ఆరడుగుల దీపికా పదుకొనే వేదికపై రెడ్ ఫెదర్ నిప్పు కోడిలా కనిపిస్తోంది.డిజైనర్ టాప్ ధరించి క్యాట్ వాక్ చేస్తూ ఉంటే ఈ ముద్దుగుమ్మ చూసిన అక్కడివారు దారితప్పి నిప్పు కోడి రాంప్ వాక్కు వచ్చిందా అనే అంతగా కనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. దీపికా పదుకొనే వేసుకున్న డ్రెస్ గురించి పర్సనల్ డిజైనర్ వెల్లడించడం జరిగింది. ఆస్కార్ ఉత్సవాలు ముగిసాయి తదుపరి రిటర్న్ జర్నీలో దీపిక పలు కార్పొరేట్ ఉత్పత్తుల ప్రకటనలు గురించి తెలియజేయడం జరిగింది. తద్వారా భారీ మొత్తాలను సంపాదించుకున్నట్లు తెలుస్తోంది సినీ కెరియర్ పరంగా చూస్తే ఈ ముద్దుగుమ్మ పఠాన్ చిత్రంతో వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.ఇక తన తదుపరి చిత్రం ప్రభాస్ తో కలిసి పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్-k, హృతిక్ రోషన్తో కలసి ఫైటర్ వంటి చిత్రాలలో నటిస్తోంది అలాగే షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో బ్రహ్మాస్త్ర -2 లో అతిధి పాత్రలో కనిపించబోతోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం దీపికా పదుకొనే కు సంబంధించి ఈ ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా బాలీవుడ్ లో దీపికా పదుకొనే అందానికి ఎవరు సాటి రారని ఈ ఫోటోలను చూస్తే చెప్పవచ్చు. ఆస్కార్ వేడుకలలో కూడా ఈ ముద్దుగుమ్మ అక్కడ అందరిని ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: