కోలీవుడ్ క్రేజీ హీరోలలో ఒకరు అయినటు వంటి కార్తీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో తమిళ బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న ఈ హీరో ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో విజయాలను అందుకున్న కార్తి తాజాగా సర్దార్ అనే మూవీ తో కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో రాసి కన్నా హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ అటు తమిళ్ ... ఇటు తెలుగు లో కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ సినిమా యొక్క తెలుగు సాటిలైట్ హక్కులను జి సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని మొదటి సారి జి సంస్థ ... జీ సినిమాలు ఛానల్లో ప్రసారం చేసింది. మొదటి సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు కేవలం 1.48 "టి ఆర్ పి" రేటింగ్ ను మాత్రమే సంపాదించుకుంది. ఆ తర్వాత రెండవ సారి ఈ సినిమా జీ తెలుగు ఛానల్లో ప్రసారం అయింది. రెండవ సారి ఈ మూవీ ప్రసారం అయినప్పుడు 3.01 "టి ఆర్ పి" ని సంపాదించుకుంది. ఇలా మొదటి సారి తో పోలిస్తే ఈ సినిమా రెండవ సారి బుల్లి తెరపై మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: