మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన పొన్నియన్ సెల్వన్  గత ఏడాది విడుదల అయిన సినిమాల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రంగా నిలిచిన సంగతి తెల్సిందే.పొన్నియన్ సెల్వన్ చిత్రం కు వెంటనే సీక్వెల్ ను కూడా తీసుకు రాబోతున్నారని తెలుస్తుంది.. తమిళనాట ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్న ఆ సినిమాకు సీక్వెల్ రెడీ అవ్వడంతో పాటు విడుదల తేదీ విషయంలో కూడా క్లారిటీ అయితే వచ్చింది.

 తమిళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పొన్నియన్ సెల్వన్ ను తెలుగు లో మాత్రం బయ్యర్స్ అస్సలు పట్టించుకోవడం లేదనే టాక్ కూడా వినిపిస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు లో ఈ సినిమాను తమిళ మేకర్స్ నేరుగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.. అతి త్వరలోనే సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమా బిజినెస్ ఆశించిన స్థాయిలో అయితే జరగడం లేదు. పొన్నియన్ సెల్వన్ పూర్తిగా తమిళ సినిమా అని.. తమిళ ఆడియన్స్ కు మాత్రమే నచ్చే సినిమా అంటూ కొందరు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ సినిమా కు తమిళనాట కాకుండా బయట అస్సలు బిజినెస్ జరగడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. మరో వైపు పొన్నియన్ సెల్వన్ మేకర్స్ మాత్రం సినిమా పై నమ్మకంతో సొంతంగా అన్ని భాషల్లో కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం అంటూ ప్రకటన  చేసారు.. అన్ని భాషల్లో పీఎస్ 1 కంటే కూడా అధికంగా ఆధరణ దక్కించుకునే విధంగా పీఎస్ 2 సినిమా ఉంటుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.. ఐశ్వర్య రాయ్ పాత్ర సినిమా లో మరింత కీలకంగా ఉంటుందని ఈసారి ఆమె నుండి మరింతగా కంటెంట్ ఉంటుందని అంతా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: