సూపర్ స్టార్ మహేష్ బాబు ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇది వరకే అతడు మరియు ఖలేజా మూవీ లు రూపొందిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ లలో అతడు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించగా ... ఖలేజా మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకోలేదు. కాకపోతే ఖలేజా మూవీ ఆ తర్వాత ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే ఇప్పటికి కూడా ఖలేజా మూవీ టీవీ లో ప్రసారం అయినప్పుడు అద్భుతమైన "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంటూ ఉంటుంది. 

ఇలా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన రెండు మూవీ లకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఈ మూవీ లో శ్రీ లీల ... పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీని  నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు త్రివిక్రమ్సినిమా కోసం వేసిన భారీ హౌస్ సెట్ లో రాత్రి వేళ కథకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ... అందులో భాగంగా మరి కొన్ని రోజుల్లోనే ఈ నైట్ షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: