బాలీవుడ్ అగ్రహీరో రాజకపూర్ కుటుంబానికి చెందిన కరీనా కపూర్ మంచినటి. కేవలం గ్లామర్ పాత్రలనే కాకుండా నటనకు అవకాశం ఉన్న అనేక సినిమాలలో ఆమె నటించి విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభిమానానాన్ని కూడ పొందింది. పెళ్ళి చేసుకుని పిల్లలకు తల్లి అయిన తరువాత కూడ ఆమె తన కెరియర్ ను కొనసాగిస్తోంది.


ఓటీటీ లో ప్రసారం అవుతున్న ‘What women Want’ టాక్ షోను గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈమె టాక్ షో విషయంలో కూడ తన సత్తాను చూపెడుతోంది. కరీనా కు జహంగీర్ జహంగీర్ 2సంవత్సరాల కొడుకు ఉన్నాడు. విపరీతంగా అల్లరి చేసే ఆచిన్నారికి ఫుడ్ పెట్టడం అంటే చాలకష్టమైనా పని అట. ఎంతో ప్రయత్నిస్తే కాని ఆబుడ్డోడు ఏమాత్రం తినడట.


స్వతహాగా మంచి డాన్సర్ అయిన కరీనా డాన్స్ చేసి స్టెప్స్ వేస్తూ నానాపాట్లు పడి తన కొడుకు కు ఫుడ్ తినిపిస్తుందట. అయితే గత కొంతకాలంగా ఒక ‘నాటు నాటు’ పాట కరీనా ఇంట్లో ప్లే చేస్తే చాలు ఏమాత్రం అల్లరి చేయకుండా బుద్దిగా ఫుడ్ తింటాడట. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ ‘నాటు నాటు’ పాట హిందీ డబ్బింగ్ వెర్షన్ పాట కాదు తెలుగు ఒరిజనల్ చంద్రబోసు వ్రాసిన ‘నాటు నాటు’ పాట మాత్రమే ఇష్టపడతాడట.

ఆపాటలోని తెలంగాణ పదాలు వినగానే జహంగీర్ కు వెంటనే ఆకలి వేసి తన తల్లి కరీనా ను ఫుడ్ పెట్టమని అడుగుతాడట. ఈపాట వల్ల తన కొడుకు కు ఫుడ్ తినిపించే విషయంలో సమస్యలు తప్పాయని ఆనందపడి ఆమె ప్రత్యేకంగా రాజమౌళికి ఫోన్ చేసి తనకు కృతజ్ఞతలు తెలిపిందట. ఈవిషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో ఈమధ్య తెలియచేసింది. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చి అంతర్జాతీయ ఖ్యాతి లభించడమే కాదు ఇలా ఫుడ్ తినను అని మారాం చేసే పిల్లలకు కూడ ఒక ‘నాటు నాటు’ పాట ఒక సైకలాజికల్ మెడిసెన్ గా పనిచేస్తోంది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: