‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించిన ఆస్కార్ అవార్డ్ టార్గెట్ కూడ పూర్తి కావడంతో రాజమౌళి పూర్తిగా తెరిపినపడి మహేష్ తో త్వరలో తీయబోతున్న సినిమా కథ పై పూర్తిగా దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు విజయేంద్ర ప్రసాద్ ఈసినిమాకు సంబంధించి రెడీ పెట్టిన ఒక స్టోరీ లైన్ పై తండ్రి కొడుకుల మధ్య చర్చలు జరుపుతున్నట్లు టాక్.


ఇండస్ట్రీ వర్గాలలో వస్తున్న లీకుల ప్రకారం మహేష్ పాత్ర హనుమంతుడు స్పూర్తితో ఉంటుందట. తన బలం తనకే తెలియకుండా ఉండే ఆహీరో ఎవరైనా ప్రోత్సహిస్తే ఎంతటి సాహసమైన చేసి విజయంసాధించే తీరులో హీరో పాత్ర ఉంటుంది అంటున్నారు. గతంలో మహేష్ ఎన్నడూ చేయని పాత్ర రేంజ్ లో ఈపాత్ర డిజైనింగ్ ఉంటుందట. ముందు అమాయకుడుగా కనిపిస్తూ కథ ముందుకు వెళ్ళే కొద్ది హీరో తీరులో మార్పు వచ్చి దుష్టులను అంతం చేయడానికి ఆఫ్రికన్ అడవులకు వెళ్ళి వారితో భీకర యుద్ధం చేసే ఈపాత్రను హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ లా ఉంటుంది అన్నమాటలు కూడ వినిపిస్తున్నాయి.


తెలుస్తున్న సమాచారం మేరకు త్వరలో ఈకథను పూర్తిగా చంద్రబోసుకు చెప్పి అతడితో మొత్తం పాటలు అన్నీ వ్రాయించే కార్యక్రమం మొదలవుతుంది అంటున్నారు. ఆతరువాత ఆపాటలకు కీరవాణి ట్యూన్స్ అందించడం కోసం మ్యూజిక్ సిటింగ్స్ జరుగుతాయి అంటున్నారు. ఈపని పూర్తి అయ్యాక ఈసినిమాకు సంబంధించిన కీలక నటీనటులను ఎంపిక చేసి వారితో కొద్ది రోజులపాటు ఒక వర్క్ షాప్ రాజమౌళి నిర్వహించే ఆలోచనలలో ఉన్నారట.


అయితే ఈపనులు అన్నీ పూర్తి కావడానికి కనీసం మరో ఆరు నెలలు పట్టే ఆస్కారం ఉందని అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీ షూటింగ్ వచ్చే సంవత్సరం జనవరిలో ప్రారంభం అవుతుంది అని అంటున్నారు. గతంలో దర్శకుడు కృష్ణవంశీ చాలసంవత్సరాల క్రితం నితిన్ ను హీరోగా చేసి ఒక అమాయకుడు అంజనీయ భక్తుడుగా దుష్ట సంహారం చేసిన మూవీ ఛాయలు రాజమౌళి కథలో ఉంటాయ అన్నదే సందేహం..



మరింత సమాచారం తెలుసుకోండి: