టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ మరియు ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన తాజా సినిమా రామబాణం. లౌక్యం, సౌఖ్యం వంటి సినిమాల సూపర్ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్గా నటించింది. కాగా జగపతిబాబు ,కుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజర్ తదితరులు మరికొన్ని కీలక పాత్రల్లో నటించడం జరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అవుట్ అండ్ డౌట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మే 5న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో జగపతిబాబు మరియు గోపీచంద్ అన్నదమ్ముల లాగా కనిపించబోతున్నారు. కాగా అందుకు సంబంధించిన విజువల్స్ కూడా ఈ సినిమాకి సంబంధించిన ప్రోమోలో చూడవచ్చు. అయితే ఇక నిజానికి గోపీచంద్ అన్నయ్య పాత్రకి జగపతిబాబు ఫస్ట్ ఛాయిస్ కాదని తెలుస్తోంది. మొదటగా ఆ పాత్ర కోసం సినిమా మేకర్స్ ఒక సీనియర్ హీరోని ముందుగా సంప్రదించారట.కానీ ఆయన మాత్రం ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్లుగా సమాచారం.కాగా ఈ వార్త తెలిసిన అనంతరం ఆ స్టార్ హీరో ఎవరు అని ఆరా తీయడం మొదలుపెట్టారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆ స్టార్ హీరో మరెవరో కాదు రాజశేఖర్.

ఈ సినిమాలో గోపీచంద్ అన్నయ్య పాత్ర కోసం రాజశేఖర్ ని సంప్రదించడంతో ఆయనకు ఆ సినిమాలోని ఆయన పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే కూడా చేశారట .అనంతరం ఏవో కొన్ని కారణాలవల్ల తన మనసు మార్చుకుని సున్నితంగా చేయను అని చెప్పేసారట. దాంతో ఆ పాత్ర కోసం జగపతిబాబును తీసుకున్నారట మేకర్స్.ఇదిలా ఉంటే ఇక సినిమాలో గోపీచంద్ తర్వాత జగపతిబాబు పాత్రే చాలా హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: