తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో చైతు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీ లో ప్రియమణి , అరవింద స్వామి కీలక పాత్రలలో నటించగా ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు.

 శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను మే 12 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయగా వాటికి రెండు భాషల ప్రాంతాల ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను కూడా మొదలు పెట్టింది.

అందులో భాగంగా నిన్న రాత్రి ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించింది. అలాగే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ట్రైలర్ ను చెన్నై నుండి విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఎ సర్టిఫికెట్ లభించింది. మరి ఈ మూవీ తో చైతు ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే మే 12 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: