టాలీవుడ్ లో కొంతమంది డైరెక్టర్స్ ని చూసి హీరో తో సంబంధం లేకుండా థియేటర్స్ కి కదులుతుంటారు ఆడియన్స్.

దాదాపుగా వీళ్లకు ఒక స్టార్ హీరో కి ఉన్నంత ఇమేజి ఉంది.

కానీ వీళ్ళు కెరీర్ లో రాజమౌళి లాగ చాలా జాగ్రత్త గా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి, ఎక్కడైనా తప్పటడుగు వేసారా, ఇక కెరీర్ రిస్క్ లో పడ్డట్టే.నిన్న మొన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ ఒకే ఒక్క డిజాస్టర్ ఫ్లాప్ తో ఇండస్ట్రీ లో కనిపించకుండా పోయిన వాళ్ళు ఉన్నారు.

శ్రీను వైట్ల, వీవీ వినాయక్, శ్రీకాంత్ అడ్డాల,కొరటాల శివ ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటుంది.ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్ లోకి డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా చేరినట్టు తెలుస్తుంది.

సై రా నరసింహా రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సురేందర్ రెడ్డి చేసిన చిత్రం ఏజెంట్.

అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ఈ సినిమా ఈమధ్యనే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.37 కోట్ల రూపాయిలను పెట్టి కొంటే కనీసం 7 కోట్ల రూపాయిలు కూడా రాబట్టలేకపోయింది ఈ చిత్రం.క్రియేటివ్ రంగం లో హిట్స్ మరియు ఫ్లాప్స్ సహజమే, కానీ ఏజెంట్ చిత్రాన్ని చూస్తే అసలు ఈ చిత్రానికి డైరెక్టర్ నిజంగా సురేందర్ రెడ్డి యేనా అనిపిస్తుంది.

ఆయనకీ ఇలాంటి ఫ్లాప్స్ కొత్తేమి కాదు, గతం లో కూడా ఇలాంటి సినిమాలు తీసాడు,కానీ అప్పట్లో ఈయన సినిమాలు ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ టేకింగ్ విషయం లో మాత్రం సురేందర్ రెడ్డి మార్క్ కనిపించేది.కానీ ఈ చిత్రం లో ఎక్కడ కూడా సురేందర్ రెడ్డి మార్క్ కనిపించదు, ఇది చూసిన తర్వాతే హీరోలకు ఈయనతో సినిమాలు తియ్యడానికి భయపడిపోతున్నారు.

ఏజెంట్ చిత్రం విడుదలకు ముందు సురేందర్ రెడ్డి స్టైలిష్ స్టార్ తో అల్లు అర్జున్ తో ఒక సినిమాని ఫిక్స్ చేసాడు.

కానీ ఎప్పుడైతే ఏజెంట్ చిత్రం ఫలితం చూశాడో, అల్లు అర్జున్ మొహం చాటేస్తున్నట్టు సమాచారం.ఇంతకు ముందు స్టోరీ లైన్ చెప్పగానే ఒప్పేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తీసుకొని రా తర్వాత చూద్దాం అంటున్నాడట.అల్లు అర్జున్ తో గతం లో సురేందర్ రెడ్డి రేస్ గుర్రం లాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ తీసాడు.

అప్పట్లో ఈ సినిమా 55 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం టాప్ 4 గ్రాసర్ గా నిల్చింది.అలాంటి సినిమా తర్వాత అల్లు అర్జున్ సురేందర్ రెడ్డి ని రిజెక్ట్ చేస్తున్నాడు అనే బాధ అభిమానుల్లో నెలకొంది.

అంతే కాదు ఇంతకు ముందు అడ్వాన్స్ ఇచ్చిన కొంతమంది టాప్ నిర్మాతలు ఏజెంట్ చిత్రం చూసిన తర్వాత వెనక్కి తగ్గి, వేరు వేరు కారణాలు చెప్పి అడ్వాన్స్ ని తిరిగి తీసుకుంటున్నారు అట.ఇంత కాలం ఎన్నో ఫ్లాప్స్ వచ్చాయి కానీ, ఇలాంటి అవమానం ఎప్పుడూ జరగలేదు, ఇదే మొట్టమొదటి సారి అవ్వడం తో ఆయన మానసికంగా కూడా బాగా కృంగిపోయాడట.ఆయన పూర్తిగా తనలో మనో ధైర్యాన్ని పెంచుకొని బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: