దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత అంగన్వాడీలకు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త ను తీసుకు వచ్చింది.. అదేమిటంటే ఎవరైతే కోవిడ్ సంబంధిత విధుల్లో పాలుపంచుకుంటున్న అంగన్వాడీ వర్కర్లు అలాగే హెల్పర్ లకు కేంద్ర ప్రభుత్వం తరపున ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకం ద్వారా ఏకంగా 50 లక్షల రూపాయల బీమా కవరేజీ ని కల్పించనున్నట్లు కేంద్రం ప్రకటించింది..

ఈ పథకం కింద ఎవరు అర్హులు అంటే.. కొవిడ్-19 అవగాహనను ప్రజలలో పంచడం కోసం పాటు పడుతున్న వారితో పాటు పర్యవేక్షణ , ఇంటింటికీ వెళ్లి రేషన్ సరుకుల ను అందించే అంగన్వాడీ కార్యకర్తలు ముఖ్యంగా ఈ పథకం పరిధిలోకి వస్తారు అని తాజాగా మంగళవారం మహిళా శిశు అభివృద్ధి శాఖ కు చెందిన ఒక అధికారి వెల్లడించారు.. ఎవరైతే అంగన్ వాడి పనులు చేపడుతూ, విధుల్లో ఉంటూ కొవిడ్ తో మరణించినా..లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవించినా  అలాంటివాళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద 50 లక్షల రూపాయల బీమా వర్తిస్తుంది అని ఆ అధికారి తెలిపారు.

ఇకపోతే ఈ పథకం ఎప్పటి  నుంచి వర్తిస్తుంది అంటే మహమ్మారి దేశంలో మొదలైన తేదీ అనగా 2020 మార్చి 11వ తేదీ నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని చెప్తున్నారు.. 2020 మార్చి 11వ తేదీ తర్వాత అంగన్వాడీ  విధులు నిర్వర్తించే కార్యకర్తలు కరోనా  కారణంగా చనిపోయి వుంటే లేదా  ప్రమాదవశాత్తు ఇప్పటికే  చనిపోయిన  వారికి కూడా ఈ బీమా ను అందిస్తామని స్పష్టం చేశారు.. 2020 మార్చి 11వ తేదీ నుంచి ఈ పథకం వర్తిస్తుంది అట.. భారతదేశంలో ఉన్న అంగన్వాడీల్లో సుమారుగా 13.29 లక్షల మంది వర్కర్లు అలాగే 11.59 లక్షల మంది హెల్పర్లు వీటిలో మహిళ శిశు అభివృద్ధి శాఖ లో పనిచేస్తున్నారు.. అందరికీ కూడా 50 లక్షల రూపాయల ఉచిత బీమా ను కల్పిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ప్రజారోగ్య సిబ్బందికి ,కోవిడ్ సంబంధిత విధుల్లో పాల్గొంటున్న వారికి ఈ పథకం వర్తిస్తున్న విషయం తెలిసిందే.



 

మరింత సమాచారం తెలుసుకోండి: