ప్రస్తుతం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా పోస్టల్ శాఖ ఎన్నో రకాల సేవలను అందుబాటులోకి తీసుకు వస్తోంది.. అందులో భాగంగానే బ్యాంకులు అలాగే ఇతర సంస్థలు అందిస్తున్న మెరుగైన సేవలు అలాగే పోస్టల్ శాఖ కూడా మెరుగైన సేవలను ప్రజలకు అందించడానికి సిద్ధమైంది.. ఇందులో పేద ధనిక అనే తేడా లేకుండా సామాన్యుల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా పోస్టల్ శాఖ అందిస్తున్న ఎన్నో రకాల సేవలను పొందవచ్చు.. కొంచెం ఓపిక వుంటే ఎక్కువ మొత్తంలో రాబడి పొందే విధంగా కూడా పోస్టల్ శాఖ ప్రణాళికలను రూపొందించింది.


పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన పథకం విషయానికొస్తే, దాని పేరు రికరింగ్ డిపాజిట్ స్కీం.. ఇందులో మనం వంద రూపాయలు నుంచి కూడా పెట్టుబడి పెట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఎంత మొత్తాన్ని అయినా సరే డిపాజిట్ చేస్తూ వెళ్ళవచ్చు.. తప్పకుండా ప్రతి నెల డిపాజిట్ చేస్తూనే ఉండాలి.. మరికొంతమంది అయితే పోస్ట్ ఆఫీస్ ఆర్ డి స్కీం  లో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ మంచి లాభార్జన పొందుతుంటారు. అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇందులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ ఆర్ డి పథకంపై 5.8 శాతం వడ్డీ కూడా లభిస్తోంది.. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీరేటు సమీక్ష ఉంటుంది కాబట్టి వడ్డీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది.


అయితే అదృష్టవశాత్తు మీ స్కీం లో కొనసాగుతున్న సమయంలో వడ్డీరేటు పెరగవచ్చు లేదా స్థిరంగా ఉండవచ్చు.. కానీ తగ్గే ప్రసక్తే ఉండదు.. మీరు ఆర్ డి స్కీమ్ లో చేరిన తర్వాత నెలకు పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే 10 సంవత్సరాల తర్వాత మీ చేతికి ఏకంగా పదహారు లక్షల రూపాయలకు పైగానే లభిస్తాయి. అంతే కాదు ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. మీరు పన్ను మినహాయింపు పొందాలి అంటే మీరు ఖాతా తెరిచిన అప్పుడే పాన్ కార్డు నంబర్ ను సబ్మిట్ చేస్తే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: