ఆ షేర్ పేరు ఎం ఐ సి ఎలక్ట్రానిక్స్.. ఇక ఇది ఎల్ఈడి వీడియో డిస్ప్లే, టెలికామ్ ఎక్విప్మెంట్ డిజైన్, డెవలప్మెంట్ వంటి కార్యకలాపాల తో పాటు టెలికామ్ సంస్థల నిర్వహణ కూడా నిర్వహిస్తుంది. ఇక పోతే పోయిన సంవత్సరం ఈ షేరు విలువ కేవలం 60 పైసలు మాత్రమే. ఇకపోతే ప్రస్తుతం ఈ షేరు ధర ఒక్కొక్కటి.. రూ.21.80 గా కొనసాగుతోంది. అంటే ఉదాహరణకు గత పోయిన సంవత్సరం లక్ష రూపాయలు పెట్టి ఈ కంపెనీలో మీరు షేర్లు గనుక కొన్ని ఉండి ఉన్నట్లయితే ప్రస్తుతం వాటి విలువ ఏకంగా 36 లక్షల రూపాయలు అయి ఉండేది. అనగా ఈ షేరు విలువ కేవలం 11 నెలల సమయంలో ఏకంగా 3533 శాతం ర్యాలీ పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ కంపెనీ షేర్లలో ఇన్వెష్ట్ పెట్టినారు ప్రస్తుతం మిలియనీర్ గా మారారు.
ఇకపోతే ఈ షేర్ యొక్క కదలికల గ్రాఫ్ ని బట్టి చూస్తే మనం .. గత ఏడాది ఒక్కో షేరు విలువ రూ. 60 పైసలు ఉండగా.. ఏప్రిల్ నెలలో 67 పైసల వద్ద కొనసాగింది. మే నెల వచ్చే సరికి 77 పైసల వద్ద ఎగబాకగా జూన్ లో ఏకంగా రూ.1.29కి పెరిగింది. డిసెంబర్ వచ్చేసరికి రూ.15.99 వద్ద కొనసాగగా.. ప్రస్తుతం రూ. 21.8 0 దగ్గర కొనసాగుతోంది. దీంతో ఇన్వెస్టర్ లకు కాసుల వర్షం కురుస్తోంది అని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి