సాహో వంటి భారీ బడ్జెట్ మూవీకి డైరెక్ట్ చేసిన సుజీత్. ఇప్పుడు బాలీవుడ్ లో మరో మూవీ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ లాంటి హీరోను డైరెక్ట్ చేసినప్పటికీ దర్శకత్వ పరంగా తన ప్రతిభను నిరూపించుకోలేకపోయాడనే అపవాదు ఎటూ ఉంది. అయినప్పటికీ మళ్ళీ అవకాశం రావడం గొప్ప విషయమని చెప్పాలి.