టాలీవుడ్, కోలీవుడ్ లో హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 42 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్స్ కు దీటుగా తన అందంతో అభినయంతో ఆకట్టుకుంటోంది. గతంలో ఎంగేజ్మెంట్ జరిగి పెళ్లి ఆగిపోవడంతో త్రిష పైన పలు రకాల రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు తాజాగా తమిళ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న వేళ రాజకీయాలలో ఒక్కసారిగా మరింత హీటెక్కించేలా త్రిష పేరు వినిపిస్తోంది. నటుడు విజయ్ (టీవీకే) పార్టీ స్థాపించి తన పార్టీ నుంచి తమిళనాడు ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు.


రాబోయే ఎన్నికలలో తన పార్టీ(టీవీకే), డిఎంకె పార్టీల మధ్యే అసలైన పోటీ ఉంటుందని బిజెపి పార్టీ అసలు రేసులోనే లేదంటూ విజయ్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజకీయ విమర్శలలో భాగంగా హీరోయిన్ త్రిష పేరును ప్రస్తావిస్తూ పలు రకాల వ్యాఖ్యలు చేశారు. నాగేంద్రన్ ఇలా మాట్లాడుతూ విజయ్ కి రాజకీయ అనుభవం లేదని, ఆయన తీరును ఎద్దేవ చేస్తూ విజయ్ ముందుగా తన ఇల్లు దాటి బయటికి రావాలని ముఖ్యంగా త్రిష ఇంటి నుండి లేదా ఆమెతో ఉన్న బంధం నుంచి బయటకు వస్తే అసలైన రాజకీయ వాస్తవాలు తెలుస్తాయి అంటూ  వ్యాఖ్యలు చేశారు.


ఈ విషయాలు వైరల్ గా మారడంతో త్రిష ఈ విషయం పైన గట్టిగానే కౌంటర్ వేసింది. తన పేరును ఇలా ప్రస్తావించడంతో ఉన్నత పదవులలో ఉన్న వ్యక్తులు ఇలాంటి అసభ్యకరంగా మాట్లాడుతారని తాను ఊహించలేదని, ఎవరైనా సరే తన వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని లేకపోతే తన లీగల్ టీమ్ ద్వారా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చింది త్రిష. ఈ వ్యాఖ్యలను అటు డీఎంకే నేతలు ఖండిస్తూ బీజేపీ నేతలు మహిళలను అగౌరవపరచడం అలవాటుగా మారిందని, బిజెపి నేత నాగేంద్రన్ మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: