తెలుగులో ఎంతమంది యాంకర్స్ ఉన్నప్పటికీ యాంకర్ విష్ణు ప్రియ గురించి, ఆమె కామెడీ డైలాగ్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ సుధీర్ తో కలిసి ఈమె చేసిన షో పోవే పోరా. ఈ షోతో యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణు ప్రియ ఆ తర్వాత ఎన్నో టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరించి బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో ఎంట్రీ ఇచ్చిన విష్ణు ప్రియ మరింత క్రేజ్ సంపాదించుకొని ప్రైవేట్ ఆల్బమ్స్ వీడియోలలో నటిస్తోంది.


ప్రస్తుతం టీవీ షోలలో ,పలు రకాల వెబ్ సిరీస్, సినిమాలలో నటిస్తూ ముందుకు వెళుతున్న విష్ణు ప్రియ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో పాటు,తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా విష్ణు ప్రియ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఆమె తన పర్సనల్ విషయాలకు సంబంధించి ఒక విషయాన్ని తెలియజేసింది. ముఖ్యంగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో అనే విషయం పైన క్లారిటీ ఇచ్చింది.


విష్ణు ప్రియ మాట్లాడుతూ.. తన తల్లి ఆర్తి అగర్వాల్, శ్రియ వంటి హీరోయిన్స్ కి హెయిర్ డ్రెస్సర్ గా పనిచేసింది. దాంతో ఆమెకు ఈ పరిశ్రమ పైన కొంతమేరకు అవగాహన ఉండేది. అలా తనని కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఆలోచన తన తల్లికి ఉండేదని, ముఖ్యంగా సీరియల్స్ లో చూడాలనుకునేదని తెలిపింది.ప్రస్తుతం తాను జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నాను.. తనకి కాబోయే భర్త ఫిజికల్గా ఫిట్నెస్ గా ఉండాలి, ఐపీఎస్ లేదా పైలెట్ అయ్యి ఉండాలి అంటూ తెలియజేసింది విష్ణు ప్రియ. ప్రస్తుతం విష్ణు ప్రియ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడం తో అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: