ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ కీర్తి సురేష్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు కూడా ఒకే చిత్రంలో ఇలా క్యామియో పాత్రలో నటించడం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. వీరి పాత్రలు ఈ సినిమాలో కీలకంగా ఉండనున్నాయట. వీరి సీన్స్ కూడా హైలెట్ గా ఉంటాయని వినిపిస్తున్నాయి. ఈ సినిమా స్థాయిని మరింత పెంచుతాయంటూ చిత్ర బృందం కూడా భావిస్తోంది. డైరెక్టర్ జగదీష్ ఈ చిత్రాన్ని ఆధ్యాత్మిక మరియు చారిత్రాత్మక నేపథ్యం లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం థ్రిల్లర్ గా కూడా ఉండబోతోంది.
హీరో సుమంత్ కెరియర్ లోనే ఇదొక విభిన్నమైన ప్రయత్నిస్తున్న సినిమాగా తెలుస్తోంది. మరి కీర్తి సురేష్, సిద్దు జొన్నలగడ్డ వంటి సెలబ్రిటీస్ నటించడంతో ఈ సినిమా బిజినెస్ , ప్రమోషన్స్ కి కూడా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటివరకు ఇందుకు సంబంధించి చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే పాత్రలకు సంబంధించి అప్డేట్ వెలుపడే అవకాశం ఉన్నది. ఈ సినిమాతో హీరో సుమంత్ సక్సెస్ కొడతారేమో చూడాలి మరి. హీరోగా సరైన సక్సెస్ అందుకోక చాలా కాలం అవుతుంది సుమంత్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి