భారతదేశ దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో తాను నటించబోతున్నట్లు కంగనా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. కాగా ఈమధ్య కంగనా బయోపిక్ ల పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండడంతో... ఈ సినిమా కూడా మహా నేత ఇందిరా గాంధీ బయోపిక్ అని అందరూ భావించారు.