ఎంతో నటనా ప్రతిభ కలిగిన మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తండ్రికి తగ్గ తనయుడిగా తన సత్తా ఏమిటో నిరూపించుకుంటున్నాడు. ఇప్పటీకే అన్ని బాషలలో సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్నాడు. తన ముందుకు వచ్చిన కథలన్నింటినీ ఒప్పుకోకుండా, నటనా ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు.