ఒకప్పుడు బాలీవుడ్ లోకి టాలీవుడ్ సెలబ్రిటీలు వెళ్ళాలన్నా...బాలీవుడ్ హీరో,హీరోయిన్లు తెలుగు సినిమాల్లోకి రావాలన్నా అంత చిన్న విషయమేమీ కాదు. బాలీవుడ్ సినీ పరిశ్రమకు ఏమాత్రం తక్కువ కాదన్న స్థాయికి టాలీవుడ్ సినీ పరిశ్రమ చేరుకుంది. దాంతో ఈ మధ్య కాలంలో హిందీ చలన చిత్ర పరిశ్రమలోని పలువురు టాప్ హీరో మరియు హీరోయిన్లు మన తెలుగు సినిమాలలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.