కరోనా కష్టకాలం మళ్ళీ మొదలైంది. కాస్త గ్యాప్ ఇచ్చి తిరిగి తన ఉదృతిని కొనసాగిస్తూ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది కరోనా. సెకండ్ వేవ్ తో కరోనా ఈజ్ బ్యాక్ అంటూ కలవరపెడుతోంది. ఈ మహమ్మారికి నిరుపేదల నుండి బడా బడా కోటీశ్వరుల వరకు, సామాన్యుల నుండి మహా సెలబ్రిటీల వరకు అందరూ సమానులే... అజాగ్రత్త వహిస్తే చాలు ఎవరినైనా సరే తన కబంధహస్తాలతో కమ్మేసి మరణతీరాలకు చేరుస్తుంది.