తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రేమికులు, ప్రముఖులు అన్నగారు అని పిలుచుకునే ఏకైక నటుడు నందమూరి తారక రామారావు. ఈయన సినీ జీవితం ఎంతోమందికి ఆదర్శం, ప్రేరణ, గొప్ప నటనా పుస్తకం. సీనియర్ తారక రామారావు 50 సంవత్సరాలకు పైగా తెలుగు సినిమా రంగంలో కథానాయకుడిగా రాణించారు.