హీరో గోపీచంద్ గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. లాస్ట్ టైమ్ "చాణక్య" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మరోసారి నిరాశ పడక తప్పలేదు. ఇప్పటికే వరుస ప్లాపులతో విసుగు చెందిన గోపీచంద్ ఇప్పుడు ఎలాగైనా విజయం అందుకోవాలని కసిగా ఉన్నారు.