అక్కినేని యంగ్ హీరో అఖిల్ పై లావణ్య త్రిపాఠి పెద్ద ఆశలే పెట్టుకున్నట్లు మీడియాకు లీక్ లు ఇస్తోంది. అంతేకాదు తనకు హైదరాబాద్ చాలబాగా నచ్చిందని అందుకే ఇక్కడ ఇల్లు కూడా కొనుక్కోవడానికి ప్లాన్ చేస్తున్నాను అంటూ మీడియా ఇంటర్వ్యూలో అనేక విషయాలను షేర్ చేసుకుంది ఈ ఉత్తరప్రదేశ్ బ్యూటీ.
వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ తెలుగమ్మాయిలా మారిపోయిన లావణ్య తన పుట్టున రోజు సందర్భంగా ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తెలుగు పరిశ్రమలో ఉన్న హీరోలందరితో నటించాలని ఉంది అని అంటూ నాగార్జున సరసన నటించాను ‘మనం’లో నాగచైతన్యకు ఫ్రెండ్‌గా చేశాను అని చెపుతూ తనకు అఖిల్ తో నటించాలని ఉంది అన్న కోరికను బయట పెట్టింది లావణ్య.
‘భలే భలే మగాడివోయ్’ సక్సెస్ తో ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్న లావణ్య నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ సినిమాల పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదే సందర్భంలో లావణ్య మాట్లాడుతూ తాను ‘బాహుబలి-2’లో నటిస్తున్నాననే వార్తలు నిజంకాదని అంటూ రాజమౌళి అవకాశం ఇస్తే ఆసినిమాలోని ఏదో ఒక సీన్ లో బ్యాక్‌గ్రౌండ్‌లో నిలబడి నటించడానికైనా రెడీ అంటూ లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ మధ్యనే షూటింగ్స్ నుండి కొంత గ్యాప్ తీసుకుని ఇండొనేసియా హాలిడే ట్రిప్ కు వెళ్ళి వచ్చిన లావణ్య తాను మరింత నూతనోత్సాహంతో సినిమాలలో నటిస్తూ టాప్ హీరోయిన్ స్టేటస్ కు ఎదగడం తన లక్ష్యం అని అంటోంది. ఇంతకీ లావణ్య కోరికను అఖిల్ తీర్చగలడా అన్నదే ప్రశ్న..