‘సరైనోడు’ విడుదలకు ఇక కేవలం రెండురోజులే ఉన్న నేపధ్యంలో ఎక్కడా దర్శకుడు బోయపాటి మీడియా ముందు కనిపించక పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సామాన్యంగా బోయపాటి తాను దర్శకత్వం వహించిన సినిమా విడుదలకు ముందు జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడిలో ఆ సినిమా పేరుతో ప్రత్యేక పూజలు చేయించడం బోయపాటికి అలవాటు అనే వార్తలు ఉన్నాయి.

‘సరైనోడు’ గురించి 



అయితే బోయపాటి ఈసారి ఎక్కడా ఎటువంటి పూజలు "సరైనోడు" గురించి చేయించకపోవడం చాలామందికి అనేక అనుమానాలను కలిగిస్తోంది. నిన్నటి నుంచి ప్రారంభమైన ‘సరైనోడు’ మీడియా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎక్కువగా రకుల్ ప్రీత్ అక్కడక్కడా అల్లుఅర్జున్ కనిపిస్తూ ఉన్నా ఎక్కడా దర్శకుడు బోయపాటి కనిపించకపోవడం చాలామందికి షాకింగ్ గా మారింది.



ఇప్పటికే ఈసినిమా ఫైనల్ అవుట్ పుట్ గురించి అల్లు కాంపౌండ్ కు బోయపాటికి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి అన్న వార్తలు వచ్చిన నేపధ్యంలో బోయపాటి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కనిపించక పోవడంతో అల్లుఅర్జున్ వ్యూహాత్మకంగా బోయపాటిని పక్కకు పెడుతున్నాడా అనే అనుమానాలు ఫిలింనగర్ లో వ్యక్తం అవుతున్నాయి. జరుగుతున్న పరిస్థుతులు చూస్తూ ఉంటే ఈ సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ బన్నీ ఎకౌంట్ లోకి ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్ బోయపాటి ఎకౌంట్ లోకి వెళ్ళే విధంగా వ్యూహాత్మకంగా అల్లు కాంపౌండ్ వ్యవహరిస్తోంది అని టాక్.



దీనికితోడు ‘సరైనోడు’ ఆడియోకి చెప్పుకోతగ్గ స్పందన రాకపోవడంతో పాటు ఈసినిమా పై ఓవర్సీస్ ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించక పోవడంతో ‘సరైనోడు’ టిక్కెట్లకు అమెరికాలోని తెలుగు వారిలో ఇప్పటికీ సరైన క్రేజ్ ఏర్పడ లేదు అని టాక్. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఓవర్సీస్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో ఈ సినిమా ఫైనల్ టాక్ వచ్చాక ఈ సినిమా టిక్కెట్ల గురించి ఆలోచిద్దాం అన్న ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనితో ‘సరైనోడు’ ఒక మెరుపు లా వచ్చి వెళ్ళిపోతుందా ? లేదంటే బ్లాక్ బస్టర్ హిట్ గా మారుతుందా అనే విషయం పై రకరకాల అంచనాలు ఉన్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: